pavvision
Sunday, July 24, 2011
విరహిణి...
ఈ కురుల కౌగిల్లని విడిపించి...
ఆ మరుల మందారాలని ధరించి....
నా సిరుల శింగారాలని వరించమని...
నీ కనుల కవ్వింపుల వెనుక...
మన కలయికని కాంక్షిస్తున్న కలలెన్నో..
(The image copy right goes to my friend Vivek)
Sunday, July 3, 2011
శకుంతల...
క
ల
కన్నానే చెలి...
వేకువ జామున వాసంతిలా వస్తావని....
మనసన్నదే చెలి...
ఆ మేలుకొలుపు నీ గాజుల కోకిల గానముదే అని...
నా కన్నుల వోరచూపులకి..
నీ కాలి వేళ్ళ మొనలు వయ్యారి మాయూరీల మారి..
సంక్రాంతి ముగ్గు వేసినట్లు..
నే క
ల
కన్నానే చెలి....
ఎవరో నీవేవరో...
నా హృదయాన్వేషణలో నువు దరివా!....
నా ఆశల సౌదానివా!...
సంధ్యాకాంతుల సమీరానివా....
స-రి-గ-మ లలో లేని కొత్త రాగానివా...
సన్నజాజుల పరిమళానివా....
ఎవరో నీవేవరో...కానీ నా జీవన చిరునామా నీవే...
ఆందిందిలే నీ చిరుగాలి కబురు...
పరిమళించే ప్రతి పువ్వుని పలకరించె వయసు నా సొంతం...
పలకరించే ప్రతి తుమ్మెదని పారవశ్యించే సొగసు నీ సొంతం...
ఆందిందిలే నీ చిరుగాలి కబురు మాపటేలకే ముందుగా...
విరి మొబ్బులు ముడవకముందె విరజాజులు వాడకముందె...
నీ రాకకై...
నీ రాకకై నే వసంతమై వేచి ఉన్న......
నీ పలుకుల పాటలలో శృతి నై దాగున్నా...
నీ నడకల నాట్యంలో హొయలై నిలిచున్నా....
నీ చూపుల తీక్షణలో నిరీక్షణగా వేచియున్నా....
నీ మదిలోని ఊసులలో జ్ఞాపకమై నిదురిస్తున్నా..
కదిలే కొంటె కావేరిలా...
రాధికా రమణీయ లావణ్య రూపంలా....
ఆమని స్వగత మయూరి నృత్యంలా....
కలువరేకు కన్నుల శరత్చంద్రికలా...
కదిలే కొంటె కావేరిలా...
అలా అలా అలలా....,కుర్రాళ్ల కలలా!!....
కోనేటి కలువంటి మోముపై, ముద్ద మందారం వంటి అమాయకత్వంతో....
మల్లియ మనసుగా చేసి....మం
దా
రం సొగసుగా చేసి.......
శ్రావణ మాసపు సంధ్యా సమీర మెచ్చెలిగా...
ఉందికదండి!...
చరణమా ...
చరణమా ...
వేయి మందారాల శోభిత, మదు జనిత, ప్రేమ శృంగార కావ్యానికి.....
ఊహలే పారాణి అయి, ఊసులే అందియలై, ముఖ లావణ్యమే మృదు వ్రేల్లు అయి...
నిశ్శబ్ద సమీర, నిశీది శృంగారకేలికి స్వాగతమా!......
నీ తలపుల బిడి కౌగిట నే చిక్కి...
వేయి తారకల మద్య నీవు చంద్రికవైనా,ఈ కొలనులేని కలువ ఆశ నీవె...
అమావాస్య రోజు ఆ తారకలు నిన్ను మరిచినా..
నిన్ను నేను మరిచిన రోజున్నదా ప్రియా......
నన్ను మరచి నిన్ను తలచి.....
నీ తలపుల బిడికౌగిట నే చిక్కి!, నీ బిడియాలు దోచిన వేళ...
వెన్నెల వెన్నంటి నీ చూపులకై, వన్నెల హరివిల్లు విందులకై,
పవన సహిత నే మయురినై నీతో ఆడిన వేళ.....'to b contd'....
గారాల నీ నడుముపై...
గారాల నీ నడుముపై...
నయగారాల కురుల సయ్యాటతో నే జతకట్టగా.....
ప్రణయ రాగ సుదా వాణిగా..., నీవు పలకాలి నా మానస వీణ వసంత గీతికవై! ...
మళయ మారుత మల్లెల పరిమళమై నా మేనిని నువు తాకగా.......
తనువుల విరహ తాపాలు కరిగిపోవాలి విరజాజి పాన్పుల ఆహ్వానాలతో! ...
Saturday, July 2, 2011
నీవు తోడుగా నేను నడవన ఊహా ప్రణయ తీరాలకు....
చరణానికి పల్లవిగా... కిరణానికి వెలుగుగా...
నీవు తోడుగా నేను నడవన ఊహా ప్రణయ తీరాలకు...
అక్షరం అక్షరం కలిసి పదమవగ..పాదం పాదం కలిసి పయనమవగా......
ప్రణయం పరువమ్ కలిసి పరిణయం అయ్యే దాకా...
నేను నడవనా ఊహా ప్రణయ తీరాలకు...
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)