Sunday, July 3, 2011

నీ తలపుల బిడి కౌగిట నే చిక్కి...

వేయి తారకల మద్య నీవు చంద్రికవైనా,ఈ కొలనులేని కలువ ఆశ నీవె...
అమావాస్య రోజు ఆ తారకలు నిన్ను మరిచినా..
నిన్ను నేను మరిచిన రోజున్నదా ప్రియా......

నన్ను మరచి నిన్ను తలచి.....
నీ తలపుల బిడికౌగిట నే చిక్కి!, నీ బిడియాలు దోచిన వేళ...

వెన్నెల వెన్నంటి నీ చూపులకై, వన్నెల హరివిల్లు విందులకై,
పవన సహిత నే మయురినై నీతో ఆడిన వేళ.....'to b contd'....

గారాల నీ నడుముపై...

గారాల నీ నడుముపై...
నయగారాల కురుల సయ్యాటతో నే జతకట్టగా.....
ప్రణయ రాగ సుదా వాణిగా..., నీవు పలకాలి నా మానస వీణ వసంత గీతికవై! ...

మళయ మారుత మల్లెల పరిమళమై నా మేనిని నువు తాకగా.......
తనువుల విరహ తాపాలు కరిగిపోవాలి విరజాజి పాన్పుల ఆహ్వానాలతో! ...

Saturday, July 2, 2011

నీవు తోడుగా నేను నడవన ఊహా ప్రణయ తీరాలకు....

చరణానికి పల్లవిగా... కిరణానికి వెలుగుగా...
నీవు తోడుగా నేను నడవన ఊహా ప్రణయ తీరాలకు...
అక్షరం అక్షరం కలిసి పదమవగ..పాదం పాదం కలిసి పయనమవగా......
ప్రణయం పరువమ్ కలిసి పరిణయం అయ్యే దాకా...
నేను నడవనా ఊహా ప్రణయ తీరాలకు...